కెనడా లో దిగ్విజయం అయిన టీడీఫ్ కెనడా వారి బతుకమ్మ 2017 సంబరాలు

tdfCanada

ఇండియా బయట తెలంగాణా పల్లె ఉన్నదా అని అందరూ ఆశ్చర్య పడేటట్లు చేసిండ్రు కెనడా ల ఉన్న మన తెలంగాణా కుటుంబాల వాళ్ళు . తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం (టీడీఫ్ కెనడా) వాళ్ళ ఆధ్వర్యం ల ఈ నెల 16 నాడు (September 16th, 2017 ) కెనడా లోని  టొరంటో (మిస్సిసౌగ) నగరంలో  నిర్వహించిన  బతుకమ్మ పండుగ అచ్చం  తెలంగాణా పల్లె ను గుర్తు చేసింది. 500 మంది హాజరు అయిన ఈ సంబరాలలో ఆట, మాట, పాట అన్నిట్లా పూర్తి తెలంగాణా సాంప్రదాయ రీతిల జరుపుకొని విదేశాల్ల ఉన్న తెలంగాణా వాళ్ళు తమ సంస్కృతి ని నిలబెట్టుకోవడం ల ఎంతగా పాటు పడుతున్నారు అనే విషయానికి ఒక నిదర్శనంగ ఉన్నది. ఆహ్లాద కరం ఆయన వాతావరణంలో అనేక మంది తెలంగాణా మహిళలు రంగు రంగుల అతుకమ్మ లను పేర్చి బతుకమ్మ పాటలు పాడుకుంటూ పాడుకుంట సంతోషంగా జరుపుకున్నరు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీ లను కూడా పెట్టినారు.పెద్ద వాళ్ళు తెలంగాణా సంస్కృతి ల బతుకమ్మ పండుగు యొక్క గొప్పదనాన్ని పిల్లలకు చెప్పినారుతరువాత రక రకాల సాంప్రదాయ తెలంగాణా వంటకాల తో మంచి రుచికరమైన  భోజనాలు కూడా చెప్పినారు. ఫుడ్ డ్రైవ్ లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకు కి అందరు కూడా ఆహారాన్ని డొనేట్ చేసినారు. చాల  మంచిగా కార్య క్రమాన్ని చేసిన నిర్వాహకులను అందరూ మెచ్చుకున్నరు. కార్య క్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ,బంగారు తెలంగాణా అభివృద్ధికి  కి పాటు పడుతూనే , తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్య క్రమాలను చేస్తూ ఉంటామని తెలుపుతూ  కార్య క్రమంలో పాల్గొని విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత లు తెలిపినారు ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా కు చెందిన దిగువ పేర్కొన్న కార్యవర్గ సభ్యులు పాల్గొని అందరికి ధన్యవాధాలు తెలిపినారు. ఫౌండేషన్ కమిట చైర్మైన్ గంట మాణిక్ రెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్మన్ గార్లపాటి జితేంధర్, బోర్డు అఫ్ ట్రస్టీస్ వైస్ చైర్మన్ పిణీకేశి అమిత, అధ్యక్షులు నెరవేట్ల శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు మడుపు విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ కోండం పవన్ కుమార్, జాయింట్ సెక్రటరీ అర్షద్ ఘోరీ, ట్రెఅసురేర్ కీసర మహేందర్ రెడ్డి, గ్లోబల్ అఫైర్స్ ఇన్ ఛార్జ్ పిణీకేశి తిరుపతి రెడ్డి మరియు ఇతరులు. టీడీఫ్ కెనడా  వారు 2005 నుండి ప్రతి సంవత్సరం ఏ విధంగా బతుకమ్మ పండుగ ను కెనడా లో దిగ్విజయంగా నిర్వహిస్తున్నారో దిగువ పేర్కొన్న కోఆర్డినేటర్స్ చాలా శ్రమించి ఆ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరిపించి నారు. పద్మ గంట, కవిత  మూల, శాంత  మేడ , అమిత  రెడ్డి  పినికేసి, శ్రీదేవి  ధర్మపురి, సౌమ్య  చింతలపాని , ప్రవీణ  ఖంభంపాటి, అతిధి  పున్నం, శ్రావ్య  రెడ్డి  మెరెడ్డి, సునీత  నెరవేట్ల, రజని  మాదాడి, విజయలక్ష్మి  రావు  మడుపు , ప్రమోద్  ధర్మపురి, శేషాంక్  చింతలపాని, వెంకటరమణ  రెడ్డి  మేడ  మరియు  మహేష్  మాదాడి. ఇక్కడ త్వరలో చలి కాలం ప్రారంభం అవుతుండదంతో బతుకమ్మ సంబరాలు కొన్ని రోజుల ముందుగానే నిర్వహించదం జరిగింది అని నిర్వాహకులు తెలిపినారు.